Headlines
Published On:
Posted by Ts

ఆ సమాచారం ఇస్తే ఆరు కోట్ల బహుమతి!!

అర్జంటుగా మీకు కోటీశ్వరులు అయిపోవాలని ఉందా? అయితే ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరు కోట్ల రూపాయల భారీ బహుమతి మీ కోసమే వేచి చూస్తోంది. ఇంత పెద్ద బహుమతి ఎవరిస్తున్నారా అనుకుంటున్నారా.. ఇంకెవరు, పెద్దన్న అమెరికానే. మధ్య ఆసియా కేంద్రంగా పనిచేస్తున్న ఓ పెద్ద క్రిమినల్ నెట్ వర్క్ గురించి సరైన సమాచారం వాళ్లకు అందిస్తే, ఇంతమొత్తం బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

కమ్ చైబెక్ కొల్బయెవ్ అనే ఈ నెట్ వర్క్ అలాంటిది, ఇలాంటిది కాదు. డ్రగ్స్, ఆయుధాలు, అమ్మాయిల అక్రమ రవాణాతో పాటు బెదిరించి సొమ్ములు తీసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడుతుందని సిన్ హువా వార్తాసంస్థ తెరలిపింది.బ్రదర్స్ సర్కిల్ అనే మరో అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాతో కూడా దీనికి సంబంధం ఉంది. యూరేషియన్ నేరగాళ్ల బృందానికి చెందిన పలువురు సభ్యులు, నాయకులు కూడా ఇందులో ఉన్నారు. బ్రదర్స్ సర్కిల్ తరఫున పనిచేస్తున్నందుకు కొల్బయెవ్ గ్యాంగును అమెరికా ఎప్పుడో 2012 ఫిబ్రవరిలోనే బ్లాక్ లిస్ట్ చేసింది.

About the Author

Posted by Ts on 13:04. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

By Ts on 13:04. Filed under . Follow any responses to the RSS 2.0. Leave a response

photos