Published On:
Posted by Ts
ముద్దులతో గిన్నిస్ రికార్డు?
పాటలో అత్యధిక ముద్దు సన్నివేశాలను చిత్రీకరించి గిన్నిస్ రికార్డ్ సాధిస్తానంటున్నారు దర్శకుడు జేఎం ఇసాక్. ఈయన తొలి చిత్రం అగడంను ఎడిటింగ్ లేకుండా తెరకెక్కించి గిన్నిస్ రికార్డు సాధించారు. ఇసాక్ రూపొందిస్తున్న రెండో చిత్రం లారా. లాస్ట్ బెంచ్ బాయ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎన్.సెల్వకుమార్, కె.తామరై సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నూతన నటుడు హరి, శ్రీప్రియాంక, గీతాంజలి, లక్ష్మీ కిరణ్, గణేష్, చంద్రు, శిబి, సేతన్, విఘ్నేష్, గాట్పాడి షణ్ముగం తదితరులు నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు వివరించారు.ఇది లవ్, కామెడీ మిళితమయిన థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. వైవిద్యభరిత చిత్రాల దర్శకుడు కొత్త కథను తయారు చేసుకోవడానికి ఏకాంత ప్రదేశానికి వెళతారన్నారు. అయితే ఆయనపై సందేహంతో భార్య కూడా వెళుతుందని చెప్పారు. ఆ దర్శకుడి కథ రాయడానికి పలు అవాంతరాలు ఎదురవుతాయన్నారు. చివరి వరకు ఆయన కథను రాయలేక పోతారని పేర్కొన్నారు. ఆటంకాలకు కారణాలేమిటన్న విషయంపై ఆలోచనతో ఒక దిగ్భ్రాంతి కలిగించే సంఘటన గురించి తెలుస్తుందని చెప్పారు.
ఆ సంఘటన ఇతివృత్తంగానే దర్శకుడు కథ తయారు చేసుకుంటారని ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా లారా చిత్రం ఉంటుందని తెలిపారు. చిత్రంలోని ఒక పాటలో అత్యధిక ముద్దు సన్నివేశాలను చిత్రీకరించి గిన్నిస్ రికార్డు సాగించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పాటను త్వరలోనే చిత్రీకరించి వచ్చే వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు.