Headlines
Published On:
Posted by Ts

విరాట్ కోహ్లితో మళ్ళీ డేట్ కి వెళ్ళింది?

గతంలో విరాట్ కోహ్లితో డేట్ కి వెళ్ళి న్యూస్ లో నిలిచిన హీరోయిన్ అనుష్క శర్మ. మళ్ళీ వీరిద్దరూ రీసెంట్ గా డేట్ కి వెళ్ళి మళ్ళీ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ల పరిచయం కమర్షియల్ యాడ్స్ తో మొదలైంది. ఆనాటి నుండి నేటి వరకూ వీరిద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడిందనేది ఓపెన్ సీక్రెట్. అయితే మీడియాలో వీరిద్దరి మధ్య హాట్ ఎఫైర్ నడుస్తుందంటూ వస్తున్న వార్తలకు వీరు ఏనాడూ స్పందించలేదు. అంతే కాకుండా ఎవరేమనుకున్నా నాకేంటి అనుకుంటూ, ఇద్దరూ ఎంచక్కా లైఫ్ ను ఎంజాయ్ చేశారు. వీరిద్దరి పర్సనల్ ఎఫైర్ కారణంగా బ్రాండ్ కి బాడ్ నేమ్ వస్తుందని నిర్వాహకులు , వీరిద్దరిలో ఒకరిని తొలగించడం జరిగింది. అందుకే ఆ బ్రాండ్ నుండి విరాట్ కోహ్లి తొలగిపోయాడు. ఆప్పటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లికి దూరంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా వీరిద్దరూ ముంబాయ్ లోని ఓ రెస్టారెంట్ లో మీడియా కంట పడ్డారు. ఇంకేముంది అక్కడికి వీరు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని బిటౌన్ మీడియా కూపీ లాగింది. అందులో అనుష్క శర్మ పేరు మీద ఓ లగ్జరీ రూం బుక్ అయినట్టుగా హోటల్ రికార్డ్స్ లో ఉంది. బిటౌన్ మీడియా ఇదే న్యూస్ ని పదే పదే చెబుతుంది. అంతే కాకుండా వీరిద్దరి మీడియా దృష్టిలో పడినా కూడ, వీరు అక్కడి నుండి తప్పించుకోకుండా ఓ పది హేను నిముషాల పాటు అక్కడే నించొని ముచ్చటించుకున్నారంట. దీంతో ఈ న్యూస్ బిటౌన్ లో మరింతగా హల్ చల్ చేస్తుంది.

About the Author

Posted by Ts on 19:27. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

By Ts on 19:27. Filed under . Follow any responses to the RSS 2.0. Leave a response

photos